- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైనల్స్ కు టీమిండియా.. తండ్రిని హత్తుకొని జెమిమా కన్నీళ్లు
ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర మాట్లాడుతుండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత స్టేడియానికి వచ్చిన ఫ్యామిలీని

దిశ, వెబ్ డెస్క్: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసిన టీమిండియా మహిళల జట్టు, నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్లింది. నవీ ముంబై వేదికగా నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ లో జెమిమా అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోగా, టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో జెమిమా 134 బంతులలో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
మ్యాచ్ గెలిపించే వరకు పోరాడింది జెమిమా. ఇక మ్యాచ్ విజయం తర్వాత జెమిమా ఎమోషనల్ అయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర మాట్లాడుతుండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత స్టేడియానికి వచ్చిన ఫ్యామిలీని కలిసి కూడా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తన తండ్రిని హత్తుకొని జెమిమా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా జెమిమా మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మానసికంగా దృఢంగా లేనని, ఒత్తిడి కారణంగానే ఏడుస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 338 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి చేధించింది టీమిండియా. క్లిక్






