ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇద్ద‌రు కొత్త కెప్టెన్లు..వ‌చ్చే సీజ‌న్ మాములుగా ఉండ‌దు !

by velandi.Saikiran |

ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026, WPL 2026 టోర్నమెంట్ల నేపథ్యంలో కొత్త

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇద్ద‌రు కొత్త కెప్టెన్లు..వ‌చ్చే సీజ‌న్ మాములుగా ఉండ‌దు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026, WPL 2026 టోర్నమెంట్ల నేపథ్యంలో కొత్త కెప్టెన్లను బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకుందట ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మేరకు క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గతంలో అక్షర్ పటేల్ కెప్టెన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే అతని కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన పెద్దగా లేదు. అతడు కూడా రాణించిన దాఖలాలు గత సీజన్ లో ఎక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట.

గతంలో లక్నోకు కెప్టెన్ గా చేసిన అనుభవం రాహుల్ కు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అతడు అయితే జట్టును బాగా లీడ్ చేస్తాడని ఢిల్లీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మెగ్ లానింగ్ ను తప్పించి జెమీమాకు బాధ్యతలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందట. గత ఏడాది కాలంగా భారత జట్టులో అద్భుతంగా రాణిస్తున్నారు జెమీమా. వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. అందుకే ఆమెకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ రెండు ప్రకటనలు రానున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Next Story