- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుమ్రాకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు.. తొలి భారత పేసర్‌గా రికార్డు
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024కు సంబంధించి ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను సొంతం చేసుకున్నాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డుకు బుమ్రా ఎంపికైనట్టు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. అవార్డు కోసం బుమ్రాతోపాటు ఇంగ్లాండ్ నుంచి జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) పోటీ పడ్డారు. కానీ, ఆ ముగ్గురిని భారత పేసర్ వెనక్కినెట్టి అవార్డును సొంతం చేసుకున్నాడు.
దీంతో సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ అవార్డు గెలిచిన తొలి భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా ఈ అవార్డు సాధించిన ఐదో భారత క్రికెటర్. అతని కంటే ముందు రాహుల్ ద్రవిడ్(2004), సచిన్ టెండూల్కర్(2010), రవిచంద్రన్ అశ్విన్(2016), విరాట్ కోహ్లీ(2017, 2018) ఉన్నారు. గతేడాది బుమ్రా సంచలన ప్రదర్శన చేశాడు. అతను బౌలింగ్ చేస్తేనే ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తిపోయారంటే అతిశయోక్తి కాదు.
గతేడాది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అలాగే, టెస్టుల్లో బుమ్రా విజృంభణ కొనసాగింది. 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అతనే టాప్ వికెట్ టేకర్ కావడం విశేషం. ఐసీసీ అవార్డుల్లో బుమ్రా హవా కొనసాగింది. ఇప్పటికే టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. అలాగే, టెస్టు, టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్లలో అతనికి చోటు దక్కింది.






