- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లండ్ సిరీసులో ఆడేది మూడు టెస్టులే.. తేల్చేసిన బుమ్రా!
ఇంగ్లండ్ సిరీసులో తను మూడు టెస్టులే ఆడతానని బుమ్రా తేల్చేశాడు. అందుకే కెప్టెన్సీ కూడా వద్దన్నట్లు వెల్లడించాడు.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో ఆడే ఐదు టెస్టుల్లో తను మూడు టెస్టులు కన్ఫర్మ్‌గా ఆడతానని, హెడింగ్లే వేదికగా జరిగే తొలి టెస్టులో కూడా ఆడుతున్నానని బుమ్రా స్పష్టంచేశాడు. ‘మూడు టెస్టులు కచ్చితంగా ఆడతానని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అదే మా ప్లాన్. అంటే మిగతావి ఆడటం లేదని కాదు. ఎగ్జాక్ట్‌గా ఇన్ని టెస్టులే ఆడాలని ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ టెస్టు అయితే కచ్చితంగా ఆడుతున్నా. ఆ తర్వాత వర్క్‌లోడ్, మ్యాచ్ పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికైతే మూడు టెస్టులు ఆడటం వల్ల నా శరీరంపై పెద్దగా భారం పడదని అనుకుంటున్నా’ అని వివరించాడీ స్టార్ పేసర్.
అదే తను కెప్టెన్ అయ్యుంటే కేవలం మూడు మ్యాచులే ఆడతానని చెప్పలేకపోయేవాడినన్నాడు. అలా చేస్తే జట్టుకు తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పాడు. ఒక ప్లేయర్‌గా తన వందశాతం ఆడతానని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.






