బుమ్రాకు అరుదైన గౌరవం.. కోహ్లీ, సెహ్వాగ్, సచిన్ తర్వాత అతనే

by Harish |

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది.

బుమ్రాకు అరుదైన గౌరవం.. కోహ్లీ, సెహ్వాగ్, సచిన్ తర్వాత అతనే
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 ఏడాదికిగానూ విస్డెన్ పురుషుల లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యాడు. విస్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ 2024 ఎడిషన్‌ను మంగళవారం రిలీజ్ చేసింది. గతేడాది బుమ్రా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించాడు. 21 మ్యాచ్‌ల్లో మొత్తం 86 వికెట్లు తీశాడు. 2024లో బుమ్రానే లీడింగ్ వికెట్ టేకర్ కావడం విశేషం. టెస్టుల్లో 20 కంటే తక్కువ అవరేజ్‌తో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుమ్రా విస్డెన్ క్రికెటర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. దీంతో బుమ్రా భారత దిగ్గజాల సరసన నిలిచాడు. విస్డెన్ క్రికెటర్స్ అవార్డు గెలిచిన నాలుగో భారత క్రికెటర్ బుమ్రా. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ(2016, 2017, 2018), వీరేంద్ర సెహ్వాగ్(2008, 2009), సచిన్ టెండూల్కర్(2010) మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు.

స్మృతి మంధాన‌కు రెండోసారి

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన విస్డెన్ ఉమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు సాధించింది. ఈ అవార్డు గెలవడం ఆమెకు ఇది రెండోసారి కావడం విశేషం. 2018లో తొలిసారిగా ఈ ఘనత సాధించింది. గతేడాది మంధాన విశేషంగా రాణించింది. మూడు ఫార్మాట్లలో 1,659 పరుగులు చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. అందులో నాలుగు వన్డే శతకాలు, టెస్టుల్లో ఓ సెంచరీ ఉన్నాయి.


Next Story