రెండో ఇన్నింగ్సులో బ్రూక్‌ కోసం మెరుగైన ప్లాన్లు వేస్తాం: బుమ్రా

by Phanindra |

బ్రూక్‌ సెంచరీ మిస్ చేసుకోవడంపై బుమ్రా స్పందించాడు. అలాగే అతని కోసం రెండో ఇన్నింగ్సులో మెరుగైన ప్లాన్లు వేస్తామని చెప్పాడు.

రెండో ఇన్నింగ్సులో బ్రూక్‌ కోసం మెరుగైన ప్లాన్లు వేస్తాం: బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ యంగ్ స్టార్ హ్యారీ బ్రూక్ తొలి ఇన్నింగ్సులో 99 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్సులో ఒక్క పరుగు కూడా చేయకుండానే బుమ్రా బౌలింగ్‌లో బ్రూక్ అవుటయ్యాడు. కానీ అది నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఈ క్రమంలో బ్రూక్ ఇన్నింగ్స్‌పై బుమ్రా స్పందించాడు. ‘తనకు 99 వరకే రాసిపెట్టినట్లుంది. ఆ నోబాల్ తర్వాత కూడా తనకు కొన్ని లైఫ్‌లు లభించాయి కదా’ అని బుమ్రా అన్నాడు.

46 పరుగుల వద్ద, 82 రన్స్ వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచులను భారత ఫీల్డర్లు నేలపాలు చేయడంతో అతను బతికిపోయాడు. ‘బ్రూక్ ఆటను ఏమాత్రం తక్కువ చేయడం లేదు. పరిస్థితులను చక్కగా అర్తం చేసుకున్నాడు. మంచి ఎగ్రెసివ్ స్టైల్‌లో ఆడాడు. భారీ షాట్ ఆడేలా కనిపించినా.. ఆడకుండా ఆగిపోతాడు. తను అద్భుతంగా ఆడాడు. రెండో ఇన్నింగ్సులో తన కోసం మెరుగైన ప్లాన్‌తో వస్తాం’ అని బుమ్రా మెచ్చుకున్నాడు.

Next Story