- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంతకాలం రాసుంటే అంతకాలం ఆడతా.. కెరీర్‌పై బుమ్రా కామెంట్స్!
గాయాల వల్ల తన కెరీర్ పెద్దగా సాగదంటూ వస్తున్న వార్తలపై బుమ్రా స్పందించాడు. ఎంతకాలం రాసుంటే అంతకాలం ఆడతానంటూ విమర్శలకు చెక్ పెట్టాడు.

X
దిశ, స్పోర్ట్స్: గాయాలతో సతమతమయ్యే జస్ప్రీత్ బుమ్రా.. ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడతాడు? అతని వర్క్ లోడ్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.. వంటి ప్రశ్నలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ఇలా తన కెరీర్‌పై వచ్చే వార్తలపై కూడా బుమ్రా స్పందించాడు. ‘నేను భారత్ తరఫున ఆడాలని అనుకుంటా. అన్ని ఫార్మాట్లలో నా నమ్మకానికి తగ్గట్లు ఆడుతూ వచ్చా. నేను ఎక్కువ కాలం ఆడలేనని చాలామంది అన్నారు. ఆరేడు నెలలే ఆడతానన్నారు.
ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్లు పూర్తిచేసుకోబోతున్నాను. ఐపీఎల్‌లో కూడా 12-13 ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పటికీ నేను జట్టు నుంచి బయటకు వెళ్లిపోతానని చాలామంది అంటుంటారు. నేను అవేం పట్టించుకోను. నేను ఎంత కాలం ఆడాలని దేవుడు రాసి పెట్టాడో అంతకాలం ఆడతా. ఆ టైంలో భారత జట్టును ఇంకా ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని వెల్లడించాడు.
Next Story






