- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు క్యాచులు వదిలేసిన జైస్వాల్.. బుమ్రా రియాక్షన్ ఏంటంటే?
బుమ్రా బౌలింగ్‌లో మూడు క్యాచులు వదిలేశాడు జైస్వాల్. దీనిపై బుమ్రా ఏమన్నాడంటే?

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న హెండిగ్లే టెస్టు తొలి ఇన్నింగ్సులో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. కెరీర్లో 10వ సారి సేనా దేశాల్లో ఫైఫర్ తీసుకొని రికార్డు సృష్టించాడు. అయితే ఈ ఇన్నింగ్సులో బుమ్రా బౌలింగ్‌లో 3 క్యాచులు నేలపాలు కాగా.. మూడింటినీ వదిలేసింది యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కావడం గమనార్హం. దీనిపై స్పందించిన బుమ్రా.. ఇలాంటి విషయాల్లో ఏం చేయలేమన్నాడు. ‘ఒక్క క్షణం చాలా డిసప్పాయింట్ అయ్యా.
కానీ అదే తలచుకొని బాధపడలేం కదా. ఈ ప్లేయర్లలో చాలామంది కొత్తవాళ్లు. ఇక్కడ ఫస్ట్ టైం ఆడుతున్నారు. ఈ పిచ్‌లపై బంతిని చూడటం, అంచనా వేయడం కొంత కష్టం. కావాలని ఎవరూ క్యాచులు వదిలెయ్యరు కదా. ఇవన్నీ ఆటలో సహజం. అలాంటప్పుడు నేను కోప్పడి ఈ కుర్రాళ్లపై ఒత్తిడి పెంచడం అనవసరం. బంతిని తన్నడం వంటివి చేసినా వాళ్లలో టెన్షన్ పెరిగిపోతుంది. వాళ్లే చిన్నగా నేర్చుకుంటారు’ అని చెప్పుకొచ్చాడీ స్పీడ్‌స్టర్.






