IPL 2025 : ముంబై ఇండియన్స్‌ను టెన్షన్ పెడుతున్న బుమ్రా

by Harish |

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

IPL 2025 : ముంబై ఇండియన్స్‌ను టెన్షన్ పెడుతున్న బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో వెన్ను గాయం బారిన పడిన అతను ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్నాడు.

మరో రెండు వారాల్లో ఐపీఎల్ ప్రారంభంకానుండగా.. బుమ్రా ఇంకా కోలుకోకపోవడం ముంబై ఇండియన్స్‌ను టెన్షన్ పెడుతున్నది. ఆరంభ మ్యాచ్‌ల్లో అతని సేవలను కోల్పోనున్నట్టు తెలుస్తోంది. ‘బుమ్రా మెడికల్ రిపోర్ట్స్ బాగున్నాయి. అతను బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే, ఐపీఎల్ ఆరంభంలో అతను బౌలింగ్ చేసే అవకాశం లేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్‌లోకి తిరిగి రావచ్చు. మెడికల్ టీమ్ అతని పని భారాన్ని పెంచుతోంది. కొన్ని రోజులు అతను ఎలాంటి అసౌకర్యంగా లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం అతనికి క్లియరెన్స్ ఇస్తుంది.’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

బీసీసీఐ వర్గాల ప్రకారం బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం ప్రారంభించలేదని అర్థమవుతుంది. ఐపీఎల్‌లో వారం లేదా రెండు వారాల అతను కోల్పోవచ్చు. అదే జరిగితే ముంబై తొలి మూడు లేదా నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో అతను ముంబై క్యాంప్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.


Next Story