- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుమ్రాపై గంభీర్ కుట్రలు.. 736 రోజుల నుంచి ఒక్క మ్యాచ్ ఆడలేదు!
జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు మ్యాచ్ ఆడాడు అంటే, ఆ రోజున కచ్చితంగా

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు మ్యాచ్ ఆడాడు అంటే, ఆ రోజున కచ్చితంగా టీమిండియా గెలవాల్సిందే. ఓడిపోవాల్సిన మ్యాచ్ ను కూడా తన బౌలింగ్ తో టర్న్ చేసేస్తాడు బుమ్రా. కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఎన్నోసార్లు విజయాలు అందించాడు బుమ్రా. అయితే అలాంటి బుమ్రాకు వన్డేలో తీవ్ర అన్యాయం జరుగుతోంది.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి వన్డేలో బుమ్రాకు ఛాన్స్ రావడం లేదు. బుమ్రా వన్డేలు ఆడి 736 రోజులు అయిపోయింది. అయినప్పటికీ అతనికి అవకాశం రావడం లేదు. కేవలం టెస్టులతో పాటు టి20లకు మాత్రమే బుమ్రాను పరిమితం చేస్తున్నారు. త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు కూడా బుమ్రా ఆడటం లేదు. రెస్ట్ ఇచ్చేశారు. దీంతో వన్డేల్లో బుమ్రాను మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. దీనికి గంభీర్ కారణం అంటూ ఫైర్ అవుతున్నారు.






