- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయాన్ని నా కొడుకుకు చెప్తా : బుమ్రా
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో లార్డ్స్ స్టేడియంలోని హానర్ బోర్డులో బుమ్రాకు చోటు దక్కింది. ఆ గౌరవం పొందిన 15 బౌలర్ బుమ్రా. తాజాగా దీనిపై బుమ్రా స్పందించాడు. ‘హానర్ బోర్డులో నా పేరు ఉండటం మంచి విషయం. నా కొడుకు పెద్దాయక హానర్ బోర్డులో నా పేరు ఉందన్న విషయాన్ని చెప్తా. కానీ, జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి.’అని చెప్పాడు. అలాగే, గత ఇంగ్లాండ్ పర్యటనను గుర్తు చేసుకున్న బుమ్రా.. షమీతో విన్నింగ్ పార్ట్‌నర్‌షిప్‌ను గుర్తు చేశాడు.2021లో లార్డ్స్ స్టేడియంలోనే జరిగిన మ్యాచ్‌లో షమీతో కలిసి ఆడిన టెస్టు మ్యాచ్ తనకు మరుపురానిదని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో తామిద్దరం బ్యాటింగ్‌తో జట్టును గెలిపించామని తెలిపాడు. ‘ఆ మ్యాచ్‌లో నేను మూడు లేదా నాలుగు వికెట్లు మాత్రమే తీశాను. కానీ,ఆ మ్యాచ్‌కు నాకు చాలా ప్రత్యేకమైనది. మేము గేములో వెనుకబడిన స్థితి నుంచి ఇంగ్లాండ్‌ను 60 ఓవర్లలోనే ఆలౌట్ చేశాం. నేనెప్పుడు భారత్‌కు ఆడినా నా సహకారం మొత్తం అందిస్తా. అప్పుడే జట్టును మంచి స్థితిలో ఉంచగలం. ’అని చెప్పుకొచ్చాడు. 2021లో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో షమీతో కలిసి బుమ్రా 9 వికెట్‌కు 89రన్స్ జోడించడంతో భారత్ ఆధిక్యం 271కు చేరింది. ఛేదనలో ఇంగ్లాండ్ 120 రన్స్‌కే కుప్పకూలడంతో భారత్ 151 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.






