బుమ్రా దెబ్బకు.. పాకిస్థాన్ రికార్డులు బ్రేక్ !

by velandi.Saikiran |

ఇండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య మొదటి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండు జట్

బుమ్రా దెబ్బకు.. పాకిస్థాన్ రికార్డులు బ్రేక్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య మొదటి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 471 పరుగులు చేయగా.. ఇటు ఇంగ్లాండ్ కూడా మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.

అయితే నాలుగు వికెట్లలో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ( Bumrah) ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 17 ఓవర్లు వేసిన బుమ్రా... 59 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇతర బౌలర్లకు వికెట్లు పడకుండా బుమ్రా మాత్రం వరుసగా వికెట్లు తీస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు.

సేన కంట్రీలలో ( SENA) ఇప్పటివరకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా... ఏకంగా 147 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే ఆసియాన్ బౌలర్ గా సేన కంట్రీలలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు పాకిస్తాన్ బౌలర్ వసీం అక్రమ్ (Wasim Akram) 146 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డును బుమ్రా బద్దలు కొట్టి మొదటి స్థానానికి వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా కంట్రీలను కలిపి సేన కంట్రీస్ అంటారు.

Instagramme link

Next Story