జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. తొలి బౌలర్‌గా రికార్డు

by Gantepaka Srikanth |

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌(ICC Cricketer of the Year)గా టీమిండియా(Team India) స్టార్ బౌలర్ బుమ్రా(Jasprit Bumrah) నిలిచారు.

జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. తొలి బౌలర్‌గా రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌(ICC Cricketer of the Year)గా టీమిండియా(Team India) స్టార్ బౌలర్ బుమ్రా(Jasprit Bumrah) నిలిచారు. ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు క్రియేట్ చేశారు. 2024లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఐసీసీ బుమ్రాను ఎంపిక చేసింది. కాగా, గతేడాది టెస్టు(Test Cricket)ల్లో బుమ్రా అద్భుతంగా రాణించారు. మొత్తం 13 మ్యాచులు ఆడిన బుమ్రా 71 వికెట్లు తీసి అదరహో అనిపించారు. అంతేకాదు.. టెస్టుల్లో 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.

మరోవైపు మహిళా క్రికెటర్లలో ఈ అవార్డు బ్యాట‌ర్ స్మృతి మందానా(Smriti Mandhana)ను వరించింది. ఈమెకు 2024 ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది. గ‌త ఏడాది వ‌న్డే క్రికెట్‌లో స్మృతి అదరగొట్టింది. కేవ‌లం 13 వ‌న్డేల్లో 747 ర‌న్స్ చేసింది రికార్డు క్రియేట్ చేసింది. భార‌త జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించింది. స్మృతి మందానా తర్వాత లౌరా వోల్వార్డ్ 697, ట‌మ్మీ బీమౌంట్ 554, హేలే మాథ్యూస్ 469 ర‌న్స్‌తో ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నారు.

Next Story