- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
73 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు సృష్టించిన జడేజా
మూడో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేయడంతో అతను ఓ అరుదైన రికార్డును సమం చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : మూడో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేయడంతో అతను ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. లార్డ్స్ స్టేడియంలో ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ స్కోరు చేసిన రెండో బ్యాటర్ జడేజానే. తొలి ఇన్నింగ్స్‌లో 72 రన్స్ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. అతని కంటే ముందు 1952లో వినో మన్కడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 72, 184 రన్స్ చేశాడు. 73 ఏళ్ల తర్వాత జడేజా మళ్లీ ఆ ఘనత సాధించాడు. అలాగే, ఈ సిరీస్‌లో అతనికి ఇది వరుసగా నాలుగో అర్ధ శతకం. రెండో టెస్టులో(89, 69) కూడా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ప్లేయర్‌గా జడేజా నిలిచాడు. పంత్ వరుసగా 5 అర్ధ శతకాలు బాదగా.. గంగూలీ నాలుగుసార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. అలాగే, ఇంగ్లాండ్‌లో జడేజాకు ఇది 8వ 50+ స్కోరు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికసార్లు 50+ స్కోరు చేసిన భారత ప్లేయర్లు ధోనీ, గంగూలీ, పంత్, దిలీప్ వెంగ్‌సర్కార్‌ల సరసన నిలిచాడు. వారు కూడా 8సార్లు ఆ ఫీట్ నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు జడేజా. విరాట్ కోహ్లీ 7సార్లు 50కిపైగా స్కోర్లు చేయగా తాజాగా జడేజా అతన్ని వెనక్కినెట్టాడు.
- Tags
- ind vs eng
- Jadeja






