- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నీ సాధించాను..అదొక్కటే మిగిలింది.. మనసులో మాట బయటపెట్టిన జడేజా
భారత టెస్టు జట్టు కెప్టెన్సీపై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మనసులోని మాటను బయటపెట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత టెస్టు జట్టు కెప్టెన్సీపై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మనసులోని మాటను బయటపెట్టాడు. టెస్టుల్లో భారత జట్టును నడిపించాలనే కోరికను వ్యక్తం చేశాడు. తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా ఈ విషయాన్ని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌కు సారథ్యం వహించాలని ఉందా? అని అశ్విన్ అడగా.. కచ్చితంగా ఉందని జడేజా బదులిచ్చాడు. ‘నా కెరీర్‌లో చాలా సాధించాను. మిగిలింది ఒక్కటే. టెస్టు కెప్టెన్సీ. భారత జట్టును నడిపించే అవకాశం వస్తే నాకు చాలా గర్వకారణం. కెప్టెన్సీ అనేది కాలక్రమేణా నేర్చుకునేది. అనుభవజ్ఞుడైన క్రికెటర్ గేమ్‌ను బాగా అర్థం చేసుకోగలడు. నేను వేర్వేరు కెప్టెన్ల కింద ఆడాను. వారి మైండ్‌సెట్ నాకు తెలుసు. జట్టును నడిపించడానికి ప్రతి కెప్టెన్‌కు భిన్నమైన మైండ్‌సెట్ ఉంటుంది. ప్లేయర్లకు ఏం కావాలో, వారి ఆలోచన విధానం ఏంటో నాకు తెలుసు.’అని జడేజా తెలిపాడు. కాగా, ఇటీవల బీసీసీఐ యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత టెస్టు కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూరులో గిల్ కెప్టెన్సీలో జడేజా ఆడనున్నాడు. ఆ పర్యటనలో సీనియర్ ప్లేయర్ జడేజానే.






