- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్ల కంటే కూడా జడేజా గొప్పోడు.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయంలో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాది కీలక పాత్ర.

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయంలో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాది కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో రెచ్చిపోవడంతోపాటు 4 వికెట్లతో సత్తాచాటాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ప్రశంసలు కురిపించాడు. జడేజా భారత అత్యుత్తమ ఆల్‌రౌండర్ మాత్రమే కాదని, వరల్డ్‌లోనే బెస్ట్ అంటూ కితాబిచ్చాడు. బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్, షకీబ్ అల్ హసన్ కంటే అతనే బెటర్ అని చెప్పాడు. ‘భారత గొప్ప ఆల్‌రౌండర్ జడేజా అని చెప్పడంలో అనుమానాలు అవసరం లేదు. అతను 4 వేల రన్స్‌కు చేరువలో, 335 వికెట్లు తీశాడు. రిటైర్మెంట్ ప్రకటించలోపు అతను 4 వేల రన్స్, 400 వికెట్లు పూర్తి చేస్తాడని ఆశిస్తున్నా. అది గొప్ప అచీవ్‌మెంట్ అవుతుంది. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో అతను నం.1 ఆల్‌రౌండర్. దాన్ని ఎవరూ కాదనలేరు. స్టోక్స్, కమిన్స్, షకీబ్ పేర్లు వినిపిస్తున్నా జడేజా వారి కంటే ముందున్నాడు. బౌలర్‌గా, బ్యాటర్‌గా అన్ని పరిస్థితుల్లోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఈ స్థిరత్వమే మిగతా వారితో అతన్ని వేరు చేస్తుంది. వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్ అతని పొజిషన్‌ను పటిష్టం చేస్తుంది.’అని పార్థివ్ చెప్పుకొచ్చాడు.






