Ravindra Jadeja :'నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే'.జడేజా ట్వీట్‌ వైరల్‌

by Disha Web Desk 13 |
Ravindra Jadeja :నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే.జడేజా ట్వీట్‌ వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనిపై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. సొంత అభిమానుల ముందు ఓ గుజరాతీగా ఐదో ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉందని జడేజా తెలిపాడు. రవీంద్ర జడేజా మరోసారి మ్యాజిక్‌ చేశాడు. చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్‌ శర్మ మొదటి నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. వరుసగా 0, 1,1,1.. మొత్తంగా మూడు పరుగులే వచ్చాయి. సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జడేజా ఉన్నాడు.

నరాలు తెగే ఉత్కంఠ మధ్యల.. పదిహేనో ఓవర్‌ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి ఫోర్‌ బాదాడు. అంతే.. సూపర్‌ కింగ్స్‌ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సారథి ధోని అయితే ఏకంగా జడ్డూను ఎత్తుకుని మరీ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. కీలక మ్యాచ్‌లలో చెన్నైని గెలిపించిన జడేజా.. ధోనికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చాడు. కాగా ధోని-జడేజా మధ్య విభేదాలంటూ గత కొంతకాలంగా వదంతులు వచ్చాయి.. రవీంద్ర జడేజా తాజాగా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. జడ్డూ, తన భార్య రివాబా ట్రోఫీతో ధోనితో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేస్తూ.. ‘‘ఇది కేవలం ఏకైక వీరుడు, ధీరుడు ఎంఎస్‌ ధోని కోసమే చేశాం. మహీ అన్నా.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే’’ అంటూ ధోనిపై ప్రేమను కురిపించాడు.

Read more:

IPL 2023 : విజయం తర్వాత జడేజా భార్య చేసిన పని వైరల్.. స్టేడియంలోకి వస్తూనే


Next Story