- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ రూల్ బ్రేక్ చేసిన జడేజా.. చర్యలు తప్పవా?
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీసీసీఐ కొత్త తీసుకొచ్చిన ఓ నిబంధనను ఉల్లంఘించాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీసీసీఐ కొత్త తీసుకొచ్చిన ఓ నిబంధనను ఉల్లంఘించాడు. గతేడాది ఆస్ట్రేలియాలో ఓటమి అనంతరం బీసీసీఐ పలు క్రమశిక్షణ నిబంధనలను అమలు చేసింది. అందులో భాగంగా మ్యాచ్ జరిగే స్టేడియం వద్దకు ఆటగాళ్లు టీమ్ బస్‌లోనే రావాలి. సొంతంగా రావడానికి లేదు. ఈ రూల్‌ను జడేజా ఉల్లంఘించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గురువారం ఎడ్జ్‌బస్టన్‌కు అతను టీమ్ బస్‌లో రాలేదు. జట్టు కంటే ముందే అతను సొంతంగానే స్టేడియానికి చేరుకున్నాడు. ఇది బీసీసీఐ రూల్‌ను ఉల్లంఘించినట్టే అవుతుంది. మరి, జడేజాపై బోర్డు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే, జడేజాపై బోర్డు చర్యలు తీసుకునే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు కాసేపు ప్రాక్టీస్ చేయడానికి జడేజా ముందుగా వచ్చాడని పలు కథనాలు పేర్కొన్నాయి. ఇక, రెండో టెస్టు విషయానికొస్తే జడేజా 89 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. గిల్‌తో కలిసి ఏకంగా 269 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 589 పరుగులు చేసింది.






