- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ జట్టులోకి తిరిగి రావడం నాకు ఎంతో ప్రత్యేకం: రవీంద్ర జడేజా
త్వరలో ఐపీఎల్ 2026 కు సంబంధించిన మినీ వేలం జరగబోతుంది. ఈ క్రమంలో ఆయా జట్లు తమకు అవసరం లేని ప్లేయర్లను జట్టు నుంచి విడుదల చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: త్వరలో ఐపీఎల్ 2026 కు సంబంధించిన మినీ వేలం (Mini Auction) జరగబోతుంది. ఈ క్రమంలో ఆయా జట్లు తమకు అవసరం లేని ప్లేయర్లను జట్టు నుంచి విడుదల చేస్తున్నాయి. అలాగే తమకు అవసరం ఉన్న ప్లేయర్లను ఆయా జట్లు ఇతర జట్ల నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసుకుని తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను చెన్నై విడుదల చేసేందుకు సిద్ధం కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు (Rajasthan Royals team) సంజూ శాంసన్ (Sanju Samson) ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది.
దీంతో ఇరు జట్లు కలిసి.. జడేజాను రాజస్థాన్ తీసుకొగా.. సంజూ శాంసన్ ను చెన్నై జట్టు తీసుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరడంపై రవీంద్ర జడేజా స్పందించారు. “రాయల్స్ నాకు మొదటి అవకాశం ఇచ్చిన జట్టు. నా కెరీర్‌లో తొలి విజయాన్ని అందించిన వేదిక ఇదే. ఇప్పుడు తిరిగి రావడం నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇది నాకు కేవలం జట్టు మాత్రమే కాదు. నా ఇల్లు లాంటిది,” అని జడేజా భావోద్వేగంగా తెలిపారు.
“రాయల్స్‌తోనే నేను నా తొలి IPL టైటిల్ గెలిచాను. ప్రస్తుత జట్టుతో మరోసారి ఆ విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. జడేజా తిరిగి రావడం జట్టుకు ఎంతో బలాన్నిస్తుంది అని రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర తెలిపారు. “జడేజా మళ్లీ రాయల్స్ జెర్సీ తొడగడం మా కోసం చాలా ప్రత్యేకం. ఆయన ఈ ఫ్రాంచైజీని, అభిమానులను బాగా అర్థం చేసుకుంటాడు. సంవత్సరాలుగా అన్ని విభాగాల్లో మ్యాచ్‌ను మార్చగల ఆటగాడిగా ఎదిగాడు” అని ఆయన అన్నారు. “జడేజా అనుభవం, శాంతం, పోటీ భావం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే సామ్ (కరన్) కూడా బ్యాట్, బంతి రెండు చేతుల్లోనూ ఒత్తిడిని తట్టుకుని ఆడే ఆటగాడు. ఈ ఇద్దరూ కలిసి జట్టుకు సమతుల్యత, నాయకత్వం, మ్యాచ్ గెలిపించే శక్తిని అందిస్తారు” అని ఈ సందర్భంగా సంగక్కర వ్యాఖ్యానించారు.






