టీ20 ప్రపంచ కప్‌లో బోణీ కొట్టిన ఇటలీ.. నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం

by Kema Shiva Kumar |

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో ఇటలీ, నేపాల్‌పై ఘన విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్‌లో బోణీ కొట్టిన ఇటలీ.. నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026 (ICC Men's T20 World Cup-2026)లో భాగంగా ఇవాళ ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో ఇటలీ (Italy) అదరగొట్టింది. పసికూనగా భావించిన ఇటలీ పటిష్టమైన నేపాల్ (Nepal) జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే, అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌కు ఇటలీ బౌలర్లు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో నేపాల్ 19.3 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఆరిఫ్ షేక్ (27), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కలుగమగే 3 వికెట్లు, బెంజమిన్ మానేంటి 2 వికెట్లు తీసుకున్నారు.

మోస్కా సోదరుల విశ్వరూపం..

124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ, నేపాల్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లుగా వచ్చిన మోస్కా బ్రదర్స్ (Mosca brother) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 12.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఆంథోనీ మోస్కా 31 బంతుల్లో 61 పరుగులు, జస్టిన్ మోస్కా 41 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

Next Story