- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా వన్డేలపై దృష్టి పెడితే బెటర్.. రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర కామెంట్స్
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల కంటే వన్డేలపై దృష్టి పెడితే మంచిదని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల కంటే వన్డేలపై దృష్టి పెడితే మంచిదని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. బుమ్రా ఇకపై టెస్టు క్రికెట్‌లో క్రమంగా ఆడకూడదని, ప్రధానంగా వన్డేలు, టీ20లు మాత్రమే ఆడాలని సూటిగా సలహా ఇచ్చాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనల అనంతరం బుమ్రా వరుసగా భారీ వర్క్‌లోడ్ మోస్తున్నాడని చెప్పుకొచ్చాడు. 31 ఏళ్లు నిండిన అతడు ఇటీవల కాస్త ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడని కామెంట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల్లో 8 వికెట్లు, వెస్టిండీస్‌తో 2 టెస్టుల్లో 7 వికెట్లు తీశాడని, ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడని గుర్తు చేశాడు. విశ్రాంతి కోసం వన్డేలు ఆడలేదని, డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో మరో 5 టీ20ల సిరీస్ ఉన్న నేపథ్యంలో అతడి ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. భారత జట్టు తదుపరి టెస్టు ఆడేది 2026 జులై వరకు లేదని అశ్విన్ తెలిపాడు. కానీ, బుమ్రాకు టెస్టు క్రికెట్ ఎంతో ఇష్టమని, ఎంతవరకైనా ఆడాలని ఉంటుందన్నారు. అది భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుందని అన్నారు.
భారత క్రికెట్ కోసం, బుమ్రా కెరీర్ కోసం తాను అతడిని టీ20ల్లోనే చూడాలనుకుంటున్నానని అన్నాడు. అర్థం లేని వన్డేలు ఆడొద్దని.. కీలకమైన టెస్టులు మాత్రమే ఆడాలని అడ్వైస్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు అపురూపమైన ఆస్తి అని.. అతడి యాక్షన్ ఏదైనా బ్యాటర్‌కు చుక్కలు చూపిస్తుంది కానీ, అదే యాక్షన్ అతని శరీరానికి భారీ ఒత్తిడి తెస్తుందని అన్నారు. మరోవైపు బుమ్రా యాక్షన్ అసాధారణమని, హైపర్ ఎక్స్‌టెన్షన్, తక్కువ రిలీజ్ పాయింట్ ఉండటం వల్ల బంతిని ఎదుర్కొనే బ్యాటర్లకు కష్టమైనా.. అతడి వీపు, హిప్, లోయర్ బాడీకి భారీ ఒత్తిడి పెడుతుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.






