- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ వరల్డ్ కప్‌లో సత్తాచాటిన రుద్రాంక్ష్.. స్వర్ణ పతకం కైవసం
ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.

దిశ, స్పోర్ట్స్ : అర్జెంటీనాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా రుద్రాంక్ష్ పాటిల్ కూడా అదరగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఈవెంట్‌లో ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్లు రుద్రాంక్ష్, అర్జున్ సత్తాచాటాడు. అర్జున్ 634.5 స్కోరు.. రుద్రాంక్ష్ 633.7 స్కోరు చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. మెడల్ రౌండ్‌లో రుద్రాంక్ష్ మొదటి సిరీస్ నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. 252.9 స్కోరుతో టాప్ పొజిషన్‌లో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక, అర్జున్ 144.9 స్కోరుతో 7వ స్థానంతో సరిపెట్టాడు. రుద్రాంక్ష్ తెచ్చిన పతకంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.






