- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ వరల్డ్ కప్‌లో రుద్రాంక్ష్-ఆర్య బోర్సె జోడికి రజతం
by Harish |
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.

X
దిశ, స్పోర్ట్స్ : పెరులో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్-ఆర్య బోర్సె జోడీ రజతం సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జంట 632.5 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. అయితే, ఫైనల్‌లో రుద్రాంక్ష్, ఆర్య బోర్సె 11-17 తేడాతో నార్వేకు చెందిన జోన్ హెర్మన్ హెగ్-జీనెట్ హెగ్ డ్యూస్టాడ్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది. దీంతో భారత జోడీ రజతంతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈ టోర్నీ భారత్ ఖాతాలో ఇది 6వ మెడల్.
- Tags
- ISSF World Cup
Next Story






