- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్‌ప్రీత్‌కు రజతం.. షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారత షూటర్లు
ఈజిప్ట్‌లో జరుగుతున్న వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఘనంగా ముగించింది.

దిశ, స్పోర్ట్స్ : ఈజిప్ట్‌లో జరుగుతున్న వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఘనంగా ముగించింది. గుర్‌ప్రీత్ సింగ్ సోమవారం రజత పతకం సాధించి ఘనమైన ముగింపు అందించాడు. 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ సత్తాచాటాడు. 584 స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. అయితే, అతను తృటిలో గోల్డ్ మెడల్ కోల్పోయాడు. అంతే స్కోరు చేసిన ఉక్రెయిన్ షూటర్ పావ్లో కొరోస్టిలోవ్ బంగారు పతకం గెలిచాడు. ఇద్దరూ సమంగా స్కోరు చేసినప్పటికీ సెంటర్ పాయింట్ వద్ద గుర్‌ప్రీత్ కంటే కొరోస్టిలోవ్ ఎక్కువసార్లు షూట్ చేశాడు. కొరోస్టిలోవ్ ‘x’ వద్ద 29 సార్లు గురి చేసి కొట్టగా.. గుర్‌ప్రీత్ 18 సార్లు షూట్ చేయడంతో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గుర్‌ప్రీత్‌కు ఇది రెండో పతకం. 2018లో 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకమే గెలిచాడు. మరో భారత షూటర్ హర్‌ప్రీత్(577) 9వ స్థానంతో సరిపెట్టాడు. ఈ ఎడిషన్‌లో భారత్ మొత్తం 13 పతకాలు సాధించింది. అందులో 3 స్వర్నాలు, 6 రజతాలు, 4 కాంస్య పతకాలు దక్కాయి. చైనా(21) అత్యధిక మెడల్స్ గెలవగా.. మెడల్ టేబుల్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.






