జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తేజస్వినికి స్వర్ణం

by Harish |

ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ షట్లర్ల పతకాల పంట కొనసాగుతోంది.

జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తేజస్వినికి స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ షట్లర్ల పతకాల పంట కొనసాగుతోంది. యువ షూటర్ తేజస్విని 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఈవెంట్‌లో ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో తేజస్విని 575 స్కోరుతో 4వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇతర భారత షూటర్లు రియా, నామ్య కపూర్, దివాన్షి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఇక, తుది పోరులో తేజస్విని అదరగొట్టింది. 31 స్కోరుతో అందరిని వెనక్కినెట్టి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. మొత్తంగా భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. మూడు స్వర్ణాలు, నాలుగేసి రజతాలు, కాంస్యాలతో మెడల్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.


Next Story