ఆమెతో ఇషాన్ కిషన్ పెళ్లికి మాకు ఒకే.. రిలేషన్‌షిప్‌ను బయటపెట్టిన క్రికెటర్ తాతయ్య

by Harish |

ఆమెతో ఇషాన్ కిషన్ పెళ్లికి మాకు ఒకే.. రిలేషన్‌షిప్‌ను బయటపెట్టిన క్రికెటర్ తాతయ్య
X

దిశ, స్పోర్ట్స్ :భారత క్రికెటర్ ఇషాన్ కిషన్, మోడల్ అదితి హుందియా‌తో రిలేషన్‌లో ఉన్నాడని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. వీరి రిలేషన్‌షిప్‌పై ఇషాన్ కిషన్ తాతయ్య అనురాగ్ పాండే క్లారిటీ ఇచ్చారు. అది రూమర్ కాదని, వారి మధ్య సంథింగ్ సంథింగ్ నిజమేనని వెల్లడించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో పాండే మాట్లాడుతూ.. ‘ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను అంగీకరిస్తా. మా కుటుంబమంతా ఒప్పుకుంటుంది. అదితి.. ఇషాన్ గర్ల్‌ఫ్రెండ్. ఆమె ఓ మోడల్. పిల్లలను సంతోషపెట్టే వాటిని అంగీకరించాలి.’అని పాండే తెలిపారు. పాండే క్లారిటీ ఇవ్వడంతో ఇషాన్, అదితి పెళ్లి త్వరలోనే జరగనుందన్న వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వివాహం ఉండొచ్చని పలు కథనాలు పేర్కొన్నాయి. అలాగే, అదితి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అదితి. మోడలింగ్‌ చేస్తున్న ఆమె 2018 మిస్ దివా విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా నిలిచింది.


Next Story