SRH కెప్టెన్సీ రేసు..ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ !

by velandi.Saikiran |

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్ద‌రూ సన్ రైజర్స్ కెప్టెన్ కోసం పోటీ ప‌డుతున్నారు.

SRH కెప్టెన్సీ రేసు..ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత హైదరాబాద్ కెప్టెన్ ఆస్ట్రేలియా దిగ్గజం క‌మిన్స్ గాయం నుంచి కోలుకోలేదని స‌మాచారం. దీంతో హైదరాబాద్ జట్టు వాడే మొదటి దశ మ్యాచ్ ల‌కు అతడు దూరం అవుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ వస్తాడని చెబుతున్నారు. ఈ మేరకు మొదట అభిషేక్ శర్మ పేరు వినిపించగా, ఇప్పుడు ఇషాన్ కిషన్ ను కెప్టెన్ చేయాలని మరి కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కావ్య మారన్ కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అభిషేక్‌, ఇషాన్ మ‌ధ్య తీవ్ర పోటీ

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్ద‌రూ సన్ రైజర్స్ కెప్టెన్ కోసం పోటీ ప‌డుతున్నారు. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎప్పుడు ఈ ఇద్దరు క్రికెటర్లు కెప్టెన్ గా వ్యవహరించలేదు. గతంలో హైదరాబాద్ జట్టులో భువనేశ్వర్ ఉండేవాడు. మెయిన్ కెప్టెన్ కు ఏదైనా జట్టుకు దూరమైతే భువనేశ్వర్ కెప్టెన్ గా కొనసాగేవాడు. అయితే ఇప్పుడు అలాంటి ఆప్షన్ లేకపోవడంతో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పేర్లు వినిపిస్తున్నాయి. డొమెస్టిక్ క్రికెట్ లో ఝార్ఖండ్, 2016 అండర్ 19 వరల్డ్ కప్ సమయంలో భారత జట్టుకు కెప్టెన్ గా ఇషాన్ కిషన్ పనిచేశాడు. ఇటు 2016 అండర్ 19 ఆసియా కప్ సమయంలో భారత జట్టుకు అభిషేక్ శర్మ కూడా ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఇద్దరిలో ఒకరిని కావ్య సెలెక్ట్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ ఈ ఇద్దరినీ కాదనుకుంటే హెడ్ కు అవకాశం రాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story