- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Virat Kohli : రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కారణం అదేనా?
టీంఇండియా టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి విరాట్ కోహ్లీV(irat Kohli) నేడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : టీంఇండియా టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి విరాట్ కోహ్లీV(irat Kohli) నేడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వైట్ క్రికెట్ నుంచి వీడ్కోలు ప్రకటించి వారం గడవక ముందే స్టార్ బ్యాట్స్ మన్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. అయితే గత ఏడాది పొట్టి క్రికెట్ గెలిచిన అనంతరం వీరిద్దరూ టీ20 లకు గుడ్ బై చెప్పేశారు గాని వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. అయితే వీరి లక్ష్యం ఏమై ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు, అభిమానుల్లో భారీ చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా వీరు మిగతా ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారని ఊహాగానాలు వినవస్తున్నాయి.
2027లో జరిగే వన్డే ప్రపంచ కప్(One Day World Cup 2027) ను ముద్దాడటం కోసమే మిగతా ఫార్మాట్లు పక్కన పెట్టేసారని సమాచారం. ఫిట్నెస్ పరంగా ఇద్దరూ బాగానే ఉండటంతో.. వరల్డ్ కప్ గెలవడం పైనే వీరు గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా ఫార్మాట్లను వదిలేసి.. రానున్న వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వీరి సాధన కొనసాగుతుందని స్పోర్ట్స్ ఎక్స్ పర్ట్స్ కూడా చెబుతున్నారు.






