విరాట్..నిజమైన చాంపియన్ : ఇర్ఫాన్ పఠాన్

by Harish |   (  Updated:2025-05-04 16:40:41  IST  )

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు.

విరాట్..నిజమైన చాంపియన్ : ఇర్ఫాన్ పఠాన్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో అతను నిజమైన చాంపియన్ అని కితాబ్ ఇచ్చాడు. ఐపీఎల్-2025లో కోహ్లీ అదరగొడుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 505 రన్స్ చేశాడు. శుక్రవారం చెన్నయ్‌‌పై గెలుపులో విరాట్ కీలక పాత్ర పోషించాడు. 187 స్ట్రైక్‌రేటుతో ఆడిన అతను 33 బంతుల్లోనే 62 రన్స్ చేశాడు. కోహ్లీ ప్రదర్శనపై ఇర్ఫాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. టీ20లకు విరాట్ ఆటతీరు పనికి రాదనే వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ‘ఆర్సీబీకి కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తున్నాడు. కనీసం 100 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. అతడు దూకుడుగా ఆడాలంటే ఆడేస్తాడు. చెన్నయ్‌పై 187 స్ట్రైక్‌రేటుతో ఆడాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో అతను నిజమైన చాంపియన్. కోహ్లీకి దూకుడుగా ఎలా ఆడాలో తెలుసు. నిలకడగా ఏ విధంగా పరుగులు రాబట్టాలో తెలుసు.’ అని ఇర్ఫాన్ తెలిపాడు. ఈ సీజన్‌లో బెంగళూరు వరుస విజయాలతో సత్తాచాటుతోంది. 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది. చెన్నయ్‌పై విజయంతో ఆర్సీబీ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

Next Story