- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టోక్స్‌కు వర్క్‌లోడ్ లేదా?.. బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసులో బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. స్టోక్స్‌కు వర్క్‌లోడ్ లేదా? అని నిలదీశాడు.

దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన పట్టుదల కనబరిచాడు. గతేడాది పలు సర్జరీలు చేయించుకున్న అతను.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను పక్కనపెట్టి మరీ సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేశాడు. ఎండలో, పిచ్ నుంచి సరిగా సహకారం లేని సమయంలో అతను చూపిన పట్టుదలను టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు.
‘ఐదో రోజు ఉదయం స్టోక్స్ ఏకంగా 9.2 ఓవర్ల మారథాన్ స్పెల్ వేశాడు. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు.. రిషభ్ పంత్ వంటి ప్లేయర్‌ను రనౌట్ చేస్తాడు. కానీ తన వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి ఎలాంటి చర్చ జరగదు. మనం మాత్రం అలాక్కాదు’ అని పఠాన్ అన్నాడు.
‘ఐదు ఓవర్లు వేసిన తర్వాత.. మ్యాచ్ కంట్రోల్ చేయాల్సిన టైంలో బుమ్రాను పక్కన పెట్టేస్తాం. రూట్ వచ్చే వరకు తను బౌలింగ్‌కు రాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడకపోయినా.. ఈ మ్యాచులో బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్ చేయాల్సిందే. ఒక మ్యాచ్ ఆడే టైంలో ఇదేంటి?’ అని పఠాన్ ప్రశ్నించాడు.
అదే సమయంలో ఆర్చర్ బౌలింగ్‌ను కూడా కొనియాడిన అతను.. మార్నింగ్ ఆర్చర్ ఆరు ఓవర్ల స్పెల్ వేశాడని, స్టోక్స్ ఏమాత్రం వర్క్‌లోడ్ గురించి ఆలోచించలేదని చెప్పాడు. ఈ విషయంలో భారత్ పూర్తిగా వెనుకబడిందని విమర్శించాడు.






