ఐర్లాండ్ క్రికెట్‌లో ఆర్థిక సంక్షోభం

by Ajay Maddhiboyina |

మే 21, 23, 25న క్లోంటార్ఫ్‌లో వెస్టిండీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

ఐర్లాండ్ క్రికెట్‌లో ఆర్థిక సంక్షోభం
X

- ఆఫ్గానిస్తాన్‌తో సిరీస్ రద్దు

- వెస్టిండీస్, ఇంగ్లాండ్ సిరీస్‌లు యధాతథం

- మౌలిక వసతులపై పెట్టుబడులు పెడుతున్నామని వెల్లడి

దిశ, స్పోర్ట్స్: ఆఫ్గానిస్తాన్‌తో జరగాల్సిన మల్టీ ఫార్మాట్ సిరీస్‌ను ఆర్థిక కారణాల వల్ల రద్దు చేసుకుంటున్నట్లు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూలైలో‌ ఆఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే బోర్డు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో ఆఫ్గానిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు క్రికెట్ ఐర్లాండ్ సీఈవో వారెన్ డ్యూట్రోమ్ వెల్లడించారు. పెట్టుబడుల సమతుల్యతను పాటించాలనే ఉద్దేశంతో ఈ సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు వారెన్ తెలిపారు. అయితే మే-జూన్ నెలల్లో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను మాత్రం నిర్వహిస్తామని వారెన్ పేర్కొన్నారు. స్వల్పకాలిక బడ్జెట్ నిర్వహణలో భాగంగా.. రాబోయే కాలంలో వ్యూహాత్మక లక్ష్యాలలో పెట్టుబడుల సమతుల్యతను పాటించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు అప్‌గ్రేడ్ చేయడానికి ఐర్లాండ్ పెట్టుబడులు పెడుతుందని డ్యూట్రోమ్ చెప్పారు. డబ్లిన్‌లో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం, 2030లో టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఐర్లాండ్ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డ్యూట్రోమ్ వెల్లడించారు.

మే 21, 23, 25న క్లోంటార్ఫ్‌లో వెస్టిండీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 12, 14, 15న బ్రెడీలో వెస్టిండీస్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 17, 19, 21న మలహిడేలో ఇంగ్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లను ఐర్లాండ్ జట్టు ఆడుతుంది.

Next Story