IPL's brand value : పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ.. కారణం ఏంటో తెలుసా?

by Harish |

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం తగ్గిందని ఇంగ్లాండ్‌లోని బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది.

IPLs brand value : పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ.. కారణం ఏంటో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం తగ్గిందని ఇంగ్లాండ్‌లోని బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో 2024లో ఐపీఎల్ విలువ దాదాపు రూ.1,078,67 కోట్లు ఉండగా అది ఈ ఏడాది రూ.86,291 కోట్లకు పడిపోయింది. ఐపీఎల్ దాదాపు రూ.21,576 కోట్ల విలువను కోల్పోయింది. ఈ సీజన్ జరుగుతుండగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వాల్యూ పడిపోవడానికి ప్రధాన కారణమని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2025 కొన్ని రోజులు వాయిదాపడిన విషయం తెలిసిందే. మెగా వేలం, జట్ల కూర్పు వల్ల రసవత్తర మ్యాచ్‌లు జరగకపోవడం కూడా ఐపీఎల్ విలువ తగ్గడానికి మరో కారణమని నివేదిక తెలిపింది. ఈ ప్రభావం ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూపై కూడా పడింది. ఈ సీజన్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విలువ 10 శాతం క్షీణించింది. చెన్నయ్ సూపర్ కింగ్స్ వాల్యూ 24 శాతం కోల్పోగా.. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా 35 శాతం, 34 శాతం, 33 శాతం తమ విలువను కోల్పోయాయి. గుజరాత్ టైటాన్స్ మాత్రమే బ్రాండ్ వాల్యూ పెరిగిన ఏకైక టీమ్. ఆ జట్టు విలువ 2 శాతం పెరిగింది.


Next Story