- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH ఒక్కటే కాదు, మరో ఐదు ఐపీఎల్ జట్లకు కొత్త కెప్టెన్లు !
యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.

IPL2026 league new captains srh and five teams leadership change check info
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. అదే సమయంలో అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్ చేశారు కావ్య మారన్. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరతాడు. అప్పటి వరకు ఇషాన్ కిషన్ కెప్టెన్ గా కొనసాగుతాడు.
హైదరాబాద్ ఒకటే కాదు.. ఈ జట్లకు కూడా కొత్త కెప్టెన్లు?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తాత్కాలికంగా ఇషాన్ కిషన్ కెప్టెన్ గా నియామకం అయ్యాడు. దీంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా సంజు శాంసన్ త్వరలోనే కెప్టెన్ అవుతాడని ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే కేకేఆర్ కు కూడా రింకు సింగ్ కెప్టెన్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారమైతే చేస్తున్నారు. త్వరలోనే దీనిపై కేకేఆర్ యాజమాన్యం నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇదే బాటలో నడవ బోతున్నట్లు చెబుతున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్ కు అవకాశం రాబోతున్నట్లు సమాచారం. అటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లిపోయాడు. అతని స్థానంలో రవీంద్ర జడేజాను ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.






