IPL 2026 : గిల్‌కు షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు

by Harish |

IPL 2026 : గిల్‌కు షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసిన విషయం తెలిసిందే. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో ఆ టీమ్ ఒక్క రన్‌ తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో ఈ సీజన్‌లో బోణీ కూడా కొట్టింది. అనూహ్య విజయం సాధించడంతో జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందానికి అవదుల్లేవు. విజయానందంలో ఉన్న అతనికి ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించింది. నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. దీంతో జీటీ కెప్టెన్‌ గిల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం గిల్‌కు ఫైన్ వేసినట్టు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ రూల్‌ను అతిక్రమించిన రెండో సారథి గిల్. పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించడంతో ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌కు భారీగా జరిమానా పడిన విషయం తెలిసిందే.


Next Story