- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలు..ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై కీలక ప్రకటన !
ఏడాది వేసవిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలను ఎండాకాలం లోపు నిర్వహించే ఛాన్స్ ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నిర్వహిస్తారని ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన వేదికలు, మ్యాచ్ ల వివరాలు మాత్రం బయటకు రాలేదు. అంతేకాదు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ మార్చి 26వ తేదీన జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. దీనికి కారణం ఈ వేసవిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు.
ఐపీఎల్ పై మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం
ఏడాది వేసవిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలను ఎండాకాలం లోపు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో మే నెల వచ్చేసరికి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే.
ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది అంట. ఇక ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా నిర్వహించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. ఐపీఎల్ షెడ్యూల్ పై కొత్త ప్రకటన చేయనుందట బీసీసీఐ. అప్పటివరకు షెడ్యూల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి సముచితంగా బీసీసీఐ లేదని సమాచారం.






