ఐపీఎల్‌ పున:ప్రారంభం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు పొంచి ఉన్న వరుణ గండం!

by Yella Dhawani Reddy |

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌ పున:ప్రారంభం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు పొంచి ఉన్న వరుణ గండం!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తిరిగి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) శనివారం (మే 17) పున:ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 7:30లకు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB), కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (KKR) త‌ల‌ప‌డనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌ కేకేఆర్ జట్టుకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే.. ఆర్సీబీ చేతిలో కేకేఆర్ ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించాలి. అలాగే, బెంగళూరు గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‍లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

అయితే ఈ మ్యాచ్‌కు వ‌ర్షం (Rains) ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గ‌త రెండు రోజులుగా బెంగ‌ళూరులో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో 65 శాతానికి పైగా వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపింది. అయితే, ఎంత భారీ వ‌ర్షం కురిపిన‌ప్ప‌టికీ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే.. చిన్న‌స్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఉంది. వ‌ర్షం ఆగిన త‌రువాత 30 నుంచి గంట స‌మ‌యంలోనే మ్యాచ్‌కు మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. అయితే ఓవర్లను కుదించే అవకాశం ఉంది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బెంగళూరు 11 మ్యాచ్‌లు ఆడ‌గా.. 8 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అలాగే, కోల్‌క‌తా ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడ‌గా 5 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. మ‌రో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

Next Story