- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL ఫైనల్ వేదిక మార్పు!
భారత్ - పాకిస్తాన్(Bharat - Pakistan) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్(IPL) అకస్మాత్తుగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ - పాకిస్తాన్(Bharat - Pakistan) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్(IPL) అకస్మాత్తుగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం జరుగడంతో ఐపీఎల్ పున:ప్రారంభం(IPL Re Start)పై బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది. మే 17వ తేదీ నుంచి జూన్ 3 వరకు మిగిలిన మ్యాచులు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. అయితే జూన్ 3న నిర్వహించే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్(Final Match) వేదిక మారబోతున్నట్టు సమాచారం. తొలుత ఈ మ్యాచ్ ను కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్(Eden Garden) వేదికగా జరుపుతామని బీసీసీఐ ప్రకటించింది.
అయితే కొన్ని అనివార్య పరిస్థితుల వలన ఫైనల్ మ్యాచ్ ను కోల్‌కతా నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmadabad) నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి(Narendra Modi Cricket Stadium) మార్చనున్నట్టు తెలుస్తోంది. క్వాలిఫయర్-1 మ్యాచ్ ను కూడా ఇక్కడికే మార్చనున్నారని వార్తలు వినవస్తున్నాయి. దీనిపై నిర్వాహకుల నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పోర్ట్స్ మీడియాలు కథనాలు వెలువరిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.






