ఐపీఎల్‌: చీర్ లీడర్స్‌తో అసభ్య ప్రవర్తన.. రంగంలోకి దిగి పోకిరీల తోలు తీసిన పోలీసులు

by Malleboina Mahesh |

ఐపీఎల్ మ్యాచ్‌లో చీర్ లీడర్లతో కొందరు ఫ్యాన్స్ అసభ్యంగా ప్రవర్తించారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు.

ఐపీఎల్‌: చీర్ లీడర్స్‌తో అసభ్య ప్రవర్తన.. రంగంలోకి దిగి పోకిరీల తోలు తీసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన లక్నో vs పంజాబ్ (Lucknow vs Punjab) మ్యాచులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో, స్టాండ్స్‌లోని ఒక సెక్షన్ లో ఉన్న అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించారు. మైదానంలో ప్లేయర్లను ఉత్సాహ పరిచేందుకు ప్రదర్శన ఇస్తున్న చీర్ లీడర్స్ (Cheerleaders) పట్ల కొందరు పోకిరీలు అసభ్యకరంగా ప్రవర్తించారు. సదరు యువతులు వారించినప్పటికీ వినకుండా అసభ్యంగా సైగలు చేస్తూ వేధించడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

మైదానంలో ఉన్న తోటి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తం చేయడంతో.. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు (మహిళా పోలీసులు సహా) తక్షణమే రంగంలోకి దిగారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీల గుంపు దగ్గరకు వెళ్లి పోలీసులు తీవ్రంగా మందలించారు. మహిళా పోలీసులు సదరు వ్యక్తులకు గట్టి వార్నింగ్ ఇచ్చి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మ్యాచ్ చూడటానికి వచ్చి, కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి ఎంతో కష్టపడుతున్న యువతుల పట్ల ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం తీవ్రమైన నేరమని, ఆ పోకిరీలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story