- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ చైన్నై వర్సెస్ మంబై మ్యాచ్ ప్రారంభం.. టాస్ గెలిచిన చెన్నై
దేశ వ్యాప్తంగా ఐపీఎల్ 2025 సందడి కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఐపీఎల్ 2025 (IPL 2025) సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులు తమ అభిమాన జట్లు ఆడబోయే మ్యాచ్ ల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని చిదంబరం స్టేడియం (Chidambaram Stadium) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వర్సెస్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో ముంబై ఆటగాళ్లు బ్యాట్లతో క్రీజులోకి ప్రవేశించారు. చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తుండగా.. ముంబై టీంకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. ముందుగా ముంబై నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ బ్యాట్లతో క్రీజులోకి వచ్చారు. ఈ హై హీట్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో చెన్నై తరుపున భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Sing Dhoni) కూడా బరిలోకి దిగారు. దీంతో మ్యాచ్ లో మాహి ఏం మాయ చేస్తాడోనని చైన్నై అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక ఇరు జట్లకు ఆడుతున్న ఆటగాళ్లు..
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధిర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, సత్య నారాయణ రాజు
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, ఎమ్ఎస్ ధోనీ, రవీచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, కలీల్ అహ్మద్
కాగా, అంతకు ముందు హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడగా.. ఎస్ఆర్‌హెచ్ (SRH) భారీ స్కోరు నమోదు చేసి, విజయం సాధించింది.






