- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ కు ఐపీఎల్ ఛైర్మన్ శుభవార్త
రోహిత్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 ఆడటంపై ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ స్పందించారు. రోహిత్ , కోహ్లీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళరు..

దిశ, వెబ్ డెస్క్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో ఆడాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఇచ్చే ప్రమాదం పొంచి ఉందని వణికి పోతున్నారు ఫ్యాన్స్. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ఆడటంపై ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ స్పందించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళరు.. కచ్చితంగా టీమిండియాలోని ఉంటారని ఆయన వెల్లడించారు.
ఎంత మంది యువ క్రికెటర్లు వచ్చినా వాళ్ల స్థానాలు భర్తీ చేయలేరని, 2027 వరల్డ్ కప్ లో ఆడతారని పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ ఆట తీరును చూసి అందరూ వణికి పోయారు.. అలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే టీమిండియాను ఎవరు ఆపలేరన్నారు. రోకో కాంబినేషన్ గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన మాటల నేపథ్యంలో 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోనే ఉంటారని ఫ్యాన్స్ అంచనా వేసుకుంటున్నారు.






