ఇవాళే ఐపీఎల్‌–2026 'మినీ' వేలం..వీళ్లేపైనే అంద‌రి క‌ళ్లు !

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 మినీ వేలం ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అబుదాబి ( Abu Dhabi) వేదికగా జ‌రుగ‌నుంది.

ఇవాళే ఐపీఎల్‌–2026 మినీ వేలం..వీళ్లేపైనే అంద‌రి క‌ళ్లు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఫ్యాన్స్ కు అలర్ట్. ఐపీఎల్ 2026 కోసం నేడు మినీ వేలం నిర్వహించనుంది గ‌వ‌ర్నింగ్‌ కౌన్సిల్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. 359 మంది క్రికెటర్లు ఈ మినీ వేలంలో పాల్గొంటారు. అయితే 77 మంది మాత్రమే ఫ్రాంచైజీలకు అవసరం. ఇక 10 ఫ్రాంచైజీల దగ్గర మొత్తం 237.55 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇందులో కేకేఆర్ జట్టు దగ్గర 64.30 కోట్లు ఉన్నాయి. వాళ్లు దాదాపు 13 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ వద్ద 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి.

ఆ డబ్బుతో ఐదుగురు ప్లేయర్లను కొనాల్సి ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలం ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అబుదాబి ( Abu Dhabi) వేదికగా జ‌రుగ‌నుంది. ఇక ఈ మినీ వేలం స్టార్ స్పోర్ట్స్ తో పాటు జియో హాట్ స్టార్ లో చూడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఈ మినీ వేలంలో అందరి దృష్టి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రీన్ పైన ఉంది. అతడు కచ్చితంగా రూ.18 కోట్లు పలుకుతాడని అంటున్నారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, హోల్డర్ లాంటి ప్లేయర్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది.

Next Story