- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్..ఈ సారి 20 మ్యాచ్ అదనం ?
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ సారి ఈ మెగా టోర్నమెంటులో అదనంగా 20 మ్యాచ్ లు నిర్వహించాలని ఐపీఎల్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ సారి ఈ మెగా టోర్నమెంటులో అదనంగా 20 మ్యాచ్ లు నిర్వహించాలని ఐపీఎల్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రతి సారీ 70కి పైగా టోర్నమెంట్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఐపీఎల్ 2025 సమయంలో మొత్తం 74 మ్యాచ్ లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 70 లీగ్ మ్యాచ్ లు కాగా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఉన్నాయి.
అయితే ఈ సారి ఆ సంఖ్యను పెంచేందుకు సిద్ధమయ్యారట. ఐపీఎల్ 2026 లో మొత్తం 94 మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఒక్క టీం 18 మ్యాచ్ లు ఆడనుంది అన్నమాట. ఇందులో హోమ్ గ్రౌండ్ లో 9 మ్యాచ్ లు జరుగుతాయట. మిగిలిన 9 మ్యాచ్ లు ఇతర జట్ల గ్రౌండ్లలో నిర్వహిస్తారు. అలా మొత్తం 20 అదనంగా మ్యాచ్ లు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారట.
ఐపీఎల్ 2026 ఎప్పటి నుంచి ప్రారంభమంటే
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 31వ తేదీతో ముగియనుంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు జియో హాట్ స్టార్ లో మనం చూడవచ్చు.






