ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. బీసీసీఐ అధికారిక ప్రకటన

by Kema Shiva Kumar |

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఈసారి కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టేబుల్ టాప్ రెండు జట్ల మధ్య జరిగే తొలి క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌కు ధర్మశాల వేదిక కానుంది. ఇక్కడి చల్లని వాతావరణం, ఫాస్ట్ పిచ్ ఆటగాళ్లకు సవాలుగా మారనుంది. అదేవిధంగా పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ ఛండీగఢ్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్‌కు వెళ్లే రెండో జట్టును నిర్ణయించే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కూడా ఛండీగఢ్‌లోనే జరగనుంది. ఇక చివరగా ఫైనల్ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.

Next Story