- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL-2026: ఐపీఎల్ 2026 మెగా వేలం.. టోర్నీ నుంచి మరో భీకర బ్యాట్స్‌మెన్ ఔట్
IPL-2026 వేలానికి ముందే బిగ్ ప్లేయర్లు షాకుల మీద షాకులిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: IPL-2026 వేలానికి ముందే బిగ్ ప్లేయర్లు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే డూప్లెసిస్, ఆండ్రీ రస్సెల్ లాంటి ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. తాజాగా మరో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ రాబోయే ఐపీఎల్ ఎడిషన్‌కు దూరం కాబోతున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్-2026 వేలానికి తన పేరును నమోదు చేసుకోలేదు. అయితే, ఈ విషయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న 1,355 మంది ఆటగాళ్ల జాబితాలో కామెరాన్ గ్రీన్, వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్ వంటి ప్రముఖులతో పాటు మ్యాక్స్‌వెల్ పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత రెండు సీజన్లలో మ్యాక్స్‌వెల్ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, వేలంలో అతనికి డిమాండ్ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ, అతడు వేలానికి పేరే నమోదు చేసుకోకపోవడంతో దాదాపు అతడు ఐపీఎల్ నుంచి నిష్క్రమించినట్లేనని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరోవైపు సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis), మొయిన్ అలీ (Moeen Ali) ఐపీఎల్‌తో పాటు జరిగే 11వ ఎడిషన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడబోతున్నారు. మరో పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ‘పవర్ కోచ్’గా నియమితుడైన విషయం తెలిసిందే. 37 ఏళ్ల గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను గత నెలలో ఐపీఎల్ 2026 గడువు తేదీకి ముందే పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు విడుదల చేసింది. గత మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతను గత సీజన్‌లో పూర్తి స్థాయిలో ఆడలేకపోయాడు. దీంతో అతని స్థానంలో వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను కింగ్స్ రిటైన్ చేసుకుంది.






