IPL 2026: 28న ఆర్సీబీతో తొలి పోరు.. ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 వైరల్!

by Kema Shiva Kumar |

ఐపీఎల్-2026లో భాగంగా ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే ఆ జట్టు ప్లేయింగ్ 11 నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

IPL 2026: 28న ఆర్సీబీతో తొలి పోరు.. ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఐపీఎల్-2026 (IPL-2026) సందడి మొదలైంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన తొలి మ్యాచ్‌ను మార్చి 28న తన చిరకాల ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే, ఈసారి ఎస్ఆర్‌హెచ్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానుండటంతో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టనున్నారు. ఇక వైస్ కెప్టెన్‌గా డేరిండ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయింగ్ 11 సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.

ట్రెండ్ అవుతోన్న SRH ప్లెయింగ్ 11 ఇదే..

ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (C) అభిషేక్ శర్మ (V.C) హెన్రిచ్ క్లాసెన్ (WK), లియామ్ లివింగ్‌స్టన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ. ఒకవేళ అనుకున్నట్లుగా ఇదే జట్టు బరిలోకి దిగితే ఏ జట్టుకైనా ముచ్చెమటలు పట్టడం ఖాయమని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు.

జట్టులో ఉన్న రిజర్వ్ ఆటగాళ్లు వీరే..

స్మరణ్, వైభవ్ అరోరా, కమిందు మెండిస్, హర్ష్ దూబే, శివంగ్ సింగ్, ఫులేట్రా, ఎడ్వర్డ్స్, ఎషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, శివమ్ మావి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అవసరాన్ని బట్టి వీరిలో ఎవరినైనా ఇంపాక్ట్ ప్లేయర్‌గా.. లేపి పక్షంలో తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

Next Story