ఐపీఎల్‌లో టికెట్ ఫ్రౌడ్?.. నకిలీ పాస్‌లతో స్టేడియాల్లోకి ఎంట్రీ

by Harish |

ఐపీఎల్‌లో టికెట్ ఫ్రౌడ్?.. నకిలీ పాస్‌లతో స్టేడియాల్లోకి ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026‌లో ఈ నెల 4న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టికెట్ ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) డైరెక్టర్ అనంద్ వర్మనే ఈ ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది. టికెట్ హోల్డర్ల కంటే ముందే గుర్తు తెలియని వ్యక్తులు డుప్లికేట్ పాస్‌లను స్కాన్‌ చేసి స్టేడియంలోకి ప్రవేశించారని తెలిపారు. ఈ అనుభవం తనకే జరిగిందని వివరించారు. ‘నేను, నా అతిథులు హాస్పిటిలాలిటీ సెక్షన్‌కు చెల్లుబాటయ్యే టికెట్లతోనే వెళ్లాం. కానీ, మిమ్మల్ని ఎంట్రీ గేట్ వద్దే ఆపారు. నా వద్ద ఉన్న టికెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ముందే స్కాన్‌కు ఉపయోగించారు.’అని తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీకి ఆనంద్ వర్మ ఫిర్యాదు చేశారు. అలాగే, ఈ విషయాన్ని డీడీసీఏ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనన్ గుప్తా, ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి తెలియజేశారు. అలాగే, ఈ టికెట్ మోసంలో భద్రతా సిబ్బంది పాత్ర ఉందని ఆరోపించారు. మోసపూరిత మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులను లోపలికి పంపించడంతో వారి భాగస్వామ్యం ఉందన్నారు. అయితే, ఆనంద్ శర్మ ఆరోపణలపై డీడీసీఏ సెక్రెటరీ ఆశోక్ వర్మ స్పందించారు. టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందని తెలిపారు. ‘ఇది టెక్నికల్ సమస్య అని ఢిల్లీ క్యాపిటల్స్ మాకు తెలియజేసింది. కొన్నిసార్లు స్కానర్ బార్ కోడ్‌ను పరిశీలించడంలో ఫెయిల్ అవుతాయి.’అని చెప్పారు.


Next Story