IPL 2026: ఐపీఎల్ 2026 వేలం.. అన్ని జట్ల రిటెన్షన్ జాబితా వచ్చేసింది.. కీలక ప్లేయర్‌లు రిలీజ్

by Ramesh Naini |   (  Updated:2025-11-15 13:44:12  IST  )

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది.

IPL 2026: ఐపీఎల్ 2026 వేలం.. అన్ని జట్ల రిటెన్షన్ జాబితా వచ్చేసింది.. కీలక ప్లేయర్‌లు రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ క్రికెట్ లవర్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ జాబితా వచ్చేసింది. డిసెంబరు 15 వ తేదీన అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను అన్ని జట్ల ప్రాంఛైజీలు ప్రకటించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) నుంచి అభినవ్ మనోహర్, అథ్వర తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, షమీ, సిమర్‌జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను వదులుకుంది. కేకేఆర్ నుంచి ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యార్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది.

చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నుంచి మతిశా పతిరన, రాహుల్ త్రిపాఠి, వన్ష్‌ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్‌, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్‌‌లు ఉన్నారు. ముంబయి ఇండియన్స్ సత్యనారాయణ రాజు, రీస్ టాప్లీ, కేఎల్ షీర్జిత్, కర్ణ్‌ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజీబుర్ రెహ్మన్, లిజాడ్ విలియమ్స్, విజ్ఞేశ్ పుతుర్‌లను రిలీజ్ చేశారు. పంజాబ్ నుంచి 5 గురు ప్లేయర్స్ ఉన్నారు. ఆర్సీబీ నుంచి 8 , ఢిల్లీ నుంచి డుప్లెసిస్ లాంటి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేశారు. గుజరాత్ టైటాన్స్ నుంచి ఐదుగురు, లఖ్‌నవూ నుంచి డేవిడ్ మిల్లర్‌తో పాటు 6 గురుని రిలీజ్ చేశారు. రాజస్థాన్ జట్టు నుంచి 7 మంది ప్లేయర్‌లు రీలీజ్ అయ్యారు.

Next Story