RCB లోకి బుమ్రాను తీసుకొస్తా.. విజయ్ మాల్యా సంచలనం!

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన నేపథ్యంలో.. తెరపైకి

RCB లోకి బుమ్రాను తీసుకొస్తా.. విజయ్ మాల్యా  సంచలనం!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన నేపథ్యంలో.. తెరపైకి విజయ్ మాల్యా వచ్చారు. ఇండియా బ్యాంకులను దోచేసిన విజయ్ మాల్యా... ప్రస్తుతం లండన్ లోనే ఉంటున్నారు. అయితే బెంగళూరు జట్టు మాజీ ఓనర్ గా ఉన్న విజయ్ మాల్యా ( Vijay Mallya)... RCB ఛాంపియన్ కావడంతో బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే.. సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.

ఇక తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఐపీఎల్ టోర్నమెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 18 సంవత్సరాల కిందట విరాట్ కోహ్లీ ( Virat Kohli ) చాలా యంగ్ గా ఉండేవాడని.. అందుకే అతన్ని తీసుకున్నట్లు తెలిపారు. అయితే... ఇప్పటికిప్పుడు రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టులోకి ( rcb dream team) ఏ ప్లేయర్లను కొనుగోలు చేస్తారు అని ఆ ఛానల్ కు సంబంధించిన యాంకర్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా విజయ్ మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కచ్చితంగా ముంబై బౌలర్ బుమ్రాను ( Bumrah) కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అలాగే సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నలుగురు ప్లేయర్లు ఉంటే కచ్చితంగా ట్రోఫీ గెలవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. దీంతో విజయ్ మాల్యా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Next Story