ఐపీఎల్ - 2025 షెడ్యూల్ విడుదల

by Gantepaka Srikanth |

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ న్యూస్‌ను బీసీసీఐ(BCCI) రివీల్ చేసింది.

ఐపీఎల్ - 2025 షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ న్యూస్‌ను బీసీసీఐ(BCCI) రివీల్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. వచ్చే మార్చి 21వ తేదీ నుంచి సీజన్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. వాస్తవానికి బీసీసీఐ ఎప్పుడైనా.. ఐపీఎల్ షెడ్యూల్‌(IPL Schedule)ను చివరి నిమిషంలో విడుదల చేసేది. అయితే ఈసారి మాత్రం ఆ ఆనవాయితీకి బీసీసీఐ చెక్ పెట్టి రెండు నెలల ముందుగానే షెడ్యూల్ ప్రకటించింది.

అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకూడదనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఇటీవలే ఐపీఎల్ మెగా వేలం దుబాయ్ వేదికగా జరిగింది. ఈ వేలంలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు భారీ ధరకు అమ్ముడుపోయారు. రిషభ్‌ పంత్‌ (రూ. 27 కోట్లు) అత్యధిక ధర పలకగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌ (రూ.26.75 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 23.75 కోట్లు) ఉన్నారు.

Next Story