- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nitish reddy: SRH కెప్టెన్‌గా నితీశ్ రెడ్డి? ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత క్లారిటి?
Nitish reddy: SRH కెప్టెన్‌గా నితీశ్‌రెడ్డి( Nitish reddy)ని నియమించాలనే డిమాండ్ పెరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : Nitish reddy: SRH కెప్టెన్‌గా నితీశ్‌రెడ్డి( Nitish reddy)ని నియమించాలనే డిమాండ్ పెరుగుతోంది. కెప్టెన్ కమ్మిన్స్ గాయపడడంతో అతను పూర్తిగా కోలుకుంటాడో లేదో అనే అనుమానం ఉంది. అందుకే నితీశ్‌ని కెప్టెన్ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద డిబెట్ నడుస్తోంది. మన తెలుగోడు నితీష్ కుమార్(Nitish reddy) రెడ్డి ఈ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్(Pat Cummins)కి గాయమవడంతో అతను ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశముంది. కమ్మిన్స్ గాయం కారణంగా ఇప్పటికే శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో ఆడలేదు. పైగా, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా పూర్తిగా కోలుకుంటాడో లేదో అనే అనుమానం ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకారం కమ్మిన్స్ గాయం ఇంకా పూర్తిగా మానలేదు. దీంతో అతను ఐపీఎల్(IPL) ఆడతాడా? లేదా? అనే విషయంపై చర్చ నడుస్తోంది.
కమ్మిన్స్ అందుబాటులో లేకుంటే, కొత్త కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్. గతేడాది అద్భుతంగా రాణించిన నితీష్ కుమార్ రెడ్డి(Nitish reddy)కి కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. నితీష్(Nitish reddy)ను అన్నివిధాల ప్రోత్సహించిన కమ్మిన్స్, ఈసారి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించమని మేనేజ్‌మెంట్‌ను కోరుతాడా? అనేది చూడాలి. అటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ధోని స్థానంలో రుతురాజ్(Ruturaj) గతంలోనే కెప్టెన్ అయ్యాడు.
ఆర్సీబీ కూడా కోహ్లీ స్థానంలో కొత్త కెప్టెన్‌ను పెట్టింది. ఇక కేకేఆర్‌లో వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer)ను కెప్టెన్ చేయవచ్చు. అలా చూస్తే, ఐపీఎల్‌లో కొత్త కుర్రాళ్లకు కెప్టెన్సీ ఇచ్చే ట్రెండ్ ఉన్నట్టు భావించవచ్చు. ఇక కెప్టెన్సీ భారం వల్ల నితీష్ (Nitish reddy)ఆటపై ప్రభావం పడుతుందా? అనేదీ మరో ప్రశ్న. గత ఏడాది బ్యాట్‌తో, బాల్‌తో అదరగొట్టిన నితీష్(Nitish reddy), ఈసారి మరింత మంచి ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే, అతని ఆట దెబ్బతింటుందనే వాదన ఉంది. ఏదేమైనా, ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే స్పష్టత వస్తుంది. అప్పటివరకు, సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే!






